కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని యస్వాడా గ్రామపంచాయతీ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ లో మత్యకారుల వేసిన వలలో కొండచిలువ చిక్కింది. గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన పాకాల పరశురాములు అనే మత్స్యకారుడు గురువారం డ్యాం లో చేపల వల వేసి రాగా, శుక్రవారం మళ్లీ తీసుకు రావడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వలన తీస్తుండగా కొండచిలువ అగుపడింది. దీంతో భయంతో పక్కనే ఉన్న మరో మత్స్యకారుడు గువ్వ రాజుకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న మరికొందరు మత్స్యకారులు రంగనవేణి లచ్చయ్య, రంగనవేని చందు, రంగనవేణి అంజి లు దానిని బయటకి తీసి చంపేశారు.