కరీంనగర్ జిల్లా:మానకొండూర్ నియోజకవర్గానికి మంజూరైన 4.90 కోట్ల రూపాయలతో నివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి సత్వరమే పనులు మానకొండూర్ శాససనభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఎల్.ఎం.డీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఆశాఖకు సంబంధించిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీ గోడలు,టాయిలెట్లు, వంటగదుల నిర్మాణ పనులకు 4.90 కోట్ల రూపాయలు మంజూరైనట్టు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే టెండర్లు ఆహ్వానించాలన్నారు. అర్హులైన టెండరుదారులకు పనుల కాంట్రాక్ట్ అప్పగిస్తూ వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పు డు పనులను పర్యవేక్షించాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయించాలన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డీఈలు మంజుభార్గవి, రవి ప్రసాద్ తోపాటు ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.