గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చికెన్ సెంటర్లపై సోమవారం ఉదయం “ది రిపోర్టర్ టీవీ”లో వచ్చిన కథనం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి మరియు గ్రామ కారోబార్ మాధవరావు సోమవారం పర్యవేక్షించారు.
వివరాల ప్రకారం, గ్రామంలో అనేక చికెన్ సెంటర్లు ఉండడం వల్ల స్థానిక ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు కలిసి బోరు మరియు షాటర్ లను పరిశీలించారు. చికెన్ సెంటర్ నిర్వాహకులను గ్రామపంచాయతీకి పిలిచి, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.