కరీంనగర్ జిల్లా: సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ లో భాగంగా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శివారులో గత 20 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన వాటర్ సంపు వద్ద మొక్కలు నాటారు, పచ్చదనాన్ని కోసం నాటిన మొక్కలను ఇటీవల అక్రమంగా నరికి వేశారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమం కింద మొక్కలు పెంచుతుంది, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఉన్న మొక్కలను నరికి వేయడం తగదని గ్రామస్తులు పేర్కొన్నారు.
పచ్చదనం కోసం ఆహ్లాదకరంగా ఉన్న మొక్కలను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించడం తగదన్నారు. ప్రభుత్వం సర్పంచులు కార్యవర్గం లేనప్పుడు గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం అక్రమంగా చెట్లను తొలగిస్తున్న ప్రభుత్వ అధికారులు గానీ అటువైపు చూడకపోవడం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అసలు ప్రభుత్వం కింద అధికారులు ఉన్నారా లేదా అని పేర్కొంటున్నారు. చెట్లను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. ఈ విధంగా ఉన్న చెట్లను నరికి వేయడంతో గ్రామాల్లో పచ్చదనం కోల్పోతున్నారు, సిపిడబ్ల్యూ స్కీములు భాగంగా లోయర్ మానేరు డ్యామ్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసిన సంపులకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేసేవారు. ఇక్కడి నుంచి గన్నేరువరం, బెజ్జంకి మండలాలలోని గ్రామాలకు శుద్ధి చేసిన వాటర్ ను సరఫరా జరుగుతుండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ స్కీంకు ప్రభుత్వం మంగళం పాడింది. ఇ తరుణంలో ఇందులో నాటిన వివిధ రకాల మొక్కలు పెద్ద వృక్షాలుగా మారాయి. కానీ వాటిని కొందరు వ్యక్తులు విక్రయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.