కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన కక్కర్ల కిష్ట స్వామి గౌడ్ ఆదివారం సాయంత్రం తాటి చెట్టు పైనుండి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గీత వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న కల్లుగీత కార్మికుల ప్రాణాలు తెలంగాణలో రోజు రోజుకు ఎక్కడో ఒక ప్రాంతంలో పడి చనిపోవడం. వృత్తి పుట్టినప్పటి నుండి ఇలాగే ప్రమాదాలతో ఇప్పటివరకు లక్షలాది మంది చనిపోవడం, శాశ్వత వికలాంగులుగా మారడం వారి కుటుంబాలు ఇంటి పెద్దని కూలిపోయి దుర్భర జీవితాలు గడుపుతున్న గౌడ కుటుంబాలను ఈ సమాజం గుర్తించడం లేదు ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కులవృత్తి చేస్తూ మరణించే కులవృత్తి ఏది అంటే ఈ దేశంలో ఒక్క గీత వృత్తి మాత్రమే ఐదు సంవత్సరాల క్రితం వరకు. కళ్ళు సొసైటీల ద్వారా ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు గీత వృత్తి దారులం ప్రభుత్వానికి చెట్టు పన్ను కట్టేది, పట్టేదారుకు మేమే చెట్టు పన్ను కట్టేది ఇప్పటికి కూడా మేమే కడుతున్నం. ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం గీత కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేదు. దేశిని చిన్న మల్లయ్య ఆధ్వర్యంలో ఈత కార్మికుల హక్కుల కొరకు, అభివృద్ధి కొరకు సమస్యల మీద ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగినది, అయినా ఈరోజు వరకు ఏ ప్రభుత్వం కూడా గౌడుల గురించి పట్టించుకోలేదు. ఇప్పటికైనా వృత్తి రక్షణ కొరకు, గౌడుల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర పార్శారం గౌడ్ కోరారు.