- ఇద్దరు బీహార్ కూలీల మృతి?
- ఒకరికి తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి రేణికుంట గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను టోల్గేట్ అంబులెన్స్ లో కరీంనగర్లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.