● దశాబ్ది కాలంగా ఎదురు చూస్తున్న మిడ్ మానేరు భూ నిర్వాసితులకు తీపి కబురు.
● ఇళ్ళు, పరిహారం మంజూరు కోసం గతం లో పోరాటం చేసిన ఉద్యమనేత పొన్నం ప్రభాకర్.
● నేడు మంత్రి హోదాలో కల సాకారానికి కృషి
● గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాం నుండి పునరావాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ ఎదురుచూస్తున్న నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కారు తీపి కబురు..
● మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వుల జారీ..
● ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి మిడ్ మానేరు నిర్వాసితులకు ఇండ్లను మంజూరు చేయాలని కోరిన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యేలు.
● ముంపు గ్రామాల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎమ్మెల్యే లు, నేతలు
కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై 2,00,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడం కోసం మిడ్ మానేరు ప్రాజెక్టు కు 2005 కాంగ్రెస్ ప్రభుత్వ శంకుస్థాపన చేసింది.. నాటి ప్రభుత్వం సహాయంతో ప్రాజెక్టు పూర్తయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నివాసాలు కోల్పోయిన 10683 కుటుంబాలకు గతంలో 5987 ఇండ్లు మంజూరు అయ్యాయి.. మిగతా నిర్వాసితుల పక్షాన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గత దశాబ్ద కాలంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ వేములవాడ పర్యటనలో భాగంగా వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు భూ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలు ప్రతి నిర్వాసితుల కుటుంబాలకు అందజేస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో నిర్వాసితులకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు మిడ్ మానేర్ నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.
◆ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
నిర్వాసితులకు న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మిడ్ మానేర్ నిర్వాసితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.