● జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: మానేరు డ్యామ్ కరీంనగర్ నుండి గన్నేరువరం మండలంలోని మైలారం వరకు లాంచ్ సదుపాయం కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి వినతి పత్రం అందజేచారు. గన్నేరువరం మండలం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు మరియు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. వెంటనే స్పందించిన మంత్రి తెలంగాణ టూరిజం శాఖ శాఖ మాత్యులు జుపల్లి కృష్ణారావు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ లంచ్ స్టార్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని లెటర్ రాయడం జరిగినది. గన్నేరువరం మండలానికి త్వరలోనే లాంచ్ సదుపాయం కలుగుతుందని దీనికి కృషిచేసిన మంత్రివర్యులకి ఎమ్మెల్యే జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.