కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద వున్న మూల మలుపు వద్ద రెండు వ్యవసాయ బావులు చాలా ప్రమాధకరంగా వున్నాయి. అవి రాత్రి అయితే అక్కడ వున్న బావులు కనిపించడం లేదని వాటి దగ్గర ఎలాంటి భద్రత ఏర్పాటు చేయలేదు.. వాటి ముందు ఎలాంటి హెచ్చరిక బోర్డులు కానీ, బావి ముందు అడ్డు గోడ కట్టలేదని.. ఆది మరిచి అందులో ఎవరైనా పడితే కూడా కనిపించకుండా ప్రమాదకరంగా మారింది. కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే ఆ రెండు బావుల దగ్గర రాత్రి అయితే అక్కడ రెడ్ సిగ్నల్ లాగా రేడియం లాంటిది మరియు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి అని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని యువజన నాయకులు బోయిని హరీష్, తాళ్లపల్లి శ్రీనివాస్, గుంటుక రమేష్,పవన్, శివ లు కోరారు.