కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సందర్శించారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించాబడిన విధుల గురించి తెలుసుకున్నారు. వివిధ నేరాల్లో పట్టుబడి పోలీసు స్టేషన్ ఆధీనంలో ఉన్న వాహనాల గురించి అడిగి, వాటిని తొలగించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో వీధి రౌడీలుగా చలామణి అవుతూ గ్రూపులుగా ఏర్పడి, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేసినా మరియు ప్రజల తరుచూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్లు తెరవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.
సైబర్ నేరాల బారిన పడకుండా పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా, బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.
గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా మరియు పి.డి.ఎస్. బియ్యం, పేకాట ఆడేవారిని గుర్తించి పట్టుకోవడం వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఎస్సై రాజేష్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.