కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని జంగపల్లి గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టెడ్ ఎడ్ లైసెన్స్ పొందినందుకు సోమవారం జిల్లా పమేలా సత్పతి జంగపల్లి ఉపాధ్యాయులు వసుంధర, శ్రీనివాస్ మరియు హెచ్ఎం శారద లను తన కార్యాలయానికి ఆహ్వానించి అభినందనలు తెలియజేసి సత్కరించినట్లు ఉపాద్యాయులు పేర్కొన్నారు. అదనపు సమూహానికి శిక్షణ ఇవ్వడానికి ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం ఈఎల్ టి ఎ సహకారంతో జెడ్ పి ఎచ్ ఎస్ జంగపల్లితో కలిసి పని చేయనున్నది . ఈఎల్టీఏ బృందాలతో త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అశోక్‌రెడ్డి, ఈఎల్ టి ఎ స్టేట్ జనరల్ సెక్రటరీ వినయధర్ రాజు పాల్గొన్నారు.
