కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామంలోని అంగారక టౌన్ షిప్ (రాజీవ్ స్వగృహ) లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమానికి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పెయ్ హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూమిని వేలం పాట ద్వారా ప్రజలకు అమ్మేశారు. కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మూడు సంవత్సరాల నుండి ఎంతోమంది సామాన్య ప్రజలు ఫ్లాట్లు కొనుక్కొని అనేక ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి తీసుకురావడం జరిగింది.మేము మా సుడా చైర్మన్ వెంటనే స్పందించి టౌన్ షిప్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించమని అన్నారు. ఇక్కడ ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయిస్ లక్షలు వెచ్చించి ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా బాధాకరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. మొదట గ్రావిలింగ్ పనులు చేసి ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
