కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గ్రామ తాజా మాజీ సర్పంచులు తీగల మోహన్ రెడ్డి, గంప మల్లేశ్వరి, పుల్లెల లక్ష్మి,అట్టికం శారద, నగేష్ లను సోమవారం ఉదయం స్వగృహం లో అరెస్టు చేసి గన్నేరువరం పోలీస్ స్టేషన్ కి తరలించారు, సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదల కై చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన తాజా మాజీ సర్పంచ్ లు … అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికెక్కడ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేశారు. నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు చేసిన పనులకి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులను ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ అరెస్టులు చేపిస్తే మా పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంప వెంకన్న, అటికం శ్రీనివాస్ గౌడ్, పుల్లెల లక్ష్మణ్ పాల్గొన్నారు.