కరీంనగర్ జిల్లా: గన్నేరువరం – నెహ్రు యువ కేంద్ర (ఎన్.వై.కె.ఎస్)- యువ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గన్నేరువరం మండలకేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కబడ్డీ,వాలీబాల్,బ్యాట్మెంటన్, రన్నింగ్ ,షాట్ పుట్,క్రీడల్లో సుమారు 150 మంది యువకులు, వాలీబాల్, కబడ్డీ,సుమారు 12 టీములు పాల్గొన్నాయి. ఇందులో కబడ్డీ. గన్నేరువరం టీం గెలుపు పొందగా, వాలీబాల్ రేపాక టీం విజేతలుగా నిలిచారు. గెలుపు పొందిన వివిధ టీం లకు ఖాసీంపేట మాజీ ఎంపీటీసీ ఏలేటి చంద్రారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మెడల్స్, ప్రశంసా పత్రాలు,అందజేశారు. ఏలేటి చంద్రా రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా ప్రాంగణంలో తమ సమయాన్ని ఎక్కువగా వెచ్చించి వారి జీవితానికి బాటలు వేసుకోవాలని క్రీడలు మానసిక ఉల్లాసాని కలగజేస్తాయని ఒత్తిడి నుంచి దూరం చేస్తాయని మంచి వ్యాయామంగా కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు నరహరి, ప్రశాంత్, యువ చైతన్య యూత్ క్లబ్ సభ్యులు అనిల్ రెడ్డి, రేపాక బాబు సభ్యులు పాల్గొన్నారు.