కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం హైదరాబాద్ లో బిజీబిజీ గా గడిపారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామాత్యులు ,కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు లకు పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు ని కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కూడా ఉన్నారు.