- జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన రావు
కరీంనగర్ జిల్లా: ప్రస్తుత కాలంలో విద్యార్థినులు అన్ని రంగాలలో ప్రతిభ సాధించి స్వయంశక్తివంతులుగా ఎదుగాలని జిల్లా విద్యాశాఖాధికారి సిహెచ్ విఎస్ జనార్ధన రావు ఉద్బోధించారు. వీణవంక మండలం లోని ఘన్నుక్ల మోడల్ స్కూల్ లో మంగళవారం గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ను ప్రారంభించి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థినులు సమాజం నుండి ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, చట్టపరంగా వారికున్న హక్కులు గూర్చి అవగాహన కలిగి ఉండాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని, అవసరం అయినప్పుడు పెద్దలు, అధికారుల సాయం తీసుకోవాలని, తమ ఇంట్లో ఉండే మహిళలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి వహించాలని, అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న స్నేహిత కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న పరీక్షలకు ఏకాగ్రతతో ఒత్తిడికి గురికాకుండా సిద్దం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్.ఏ వేణు, గోపాల రెడ్డి, ఉపాధ్యాయులు హాఫీజుద్దిన్, శ్రీదేవి, శిరీష, అమతుల్ అయేషా పాల్గొన్నారు.