కరీంనగర్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈసందర్భంగా మండల కేంద్రం గన్నేరువరంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు, రైతులు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. వీటికి సంక్షేమానికి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పర్తి పరిపూర్ణాచారి, కొలుపుల రవి, సీనియర్ నాయకులు బద్ధం సంపత్ రెడ్డి,గుంటి సంతోష్, కూన కొమరయ్య,తదితరులు పాల్గొన్నారు.