కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో విజ్ఞాన్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయడం. రంగురంగుల ముగ్గులు వేయడం. గొబ్బెమ్మలు. హరిదాసులు. గంగిరెద్దులు లాంటి వేషధారణలతో ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ భాను చైతన్య మాట్లాడుతూ అన్ని రకాల పంటలు ఇంటికి చేరుకున్నవేల రైతులు ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అని సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాందేవ్,లత, మమత, సమంత,శిరీష, రేణుక, శ్వేత, లాస్య తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు.
