- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మారని ఎమ్మెల్యే
- కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యే గెలుపు కోసం పని చేసిన వారికి పదవులు ఎక్కడ
- ఎమ్మెల్యే కు చెప్పిన ఫలితం లేదు
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కు పదవులు లేక దూరమవుతున్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేను గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మను పోసిన కార్యకర్తలకు నేడు పదవులు లేక మూగబోయి ఉన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు బుర్ర మల్లయ్య గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 15. సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ ఇతర పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీని నమ్మి మెడలో కండువా చేతిలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఎలాగైనా అధికారం తేవాలని కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు రోజురోజుకు అవమానం ఎదురవుతుంది.. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి పదవులు కట్టబెట్టాలని సీనియర్ కార్యకర్తలు ఇటీవల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను బుర్ర మల్లయ్య గౌడ్ అడగగా సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు… అయినా సరే త్వరలో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తానని బుర్ర మల్లయ్య గౌడ్ స్పష్టం చేశారు.