కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం: ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వీణవంక మండలంలో చోటుచేసుకుంది, వీణవంక మండలం శ్రీరాములపేట అనునతాండు గ్రామానికి చెందిన కట్కూరి నారాయణ రెడ్డి తండ్రి ముత్తా రెడ్డి (73 ) మృతునితో పాటు కుర్మిండ్ల అశోక్, కాంతాల కొండల్ రెడ్డి, కాంతాల తిరుపతి రెడ్డి లు కలిసి హిమ్మత్ నగర్ వెళ్లే దారి దగ్గర గల వ్యవసాయ భూములకు నీళ్లు వెళ్లే మోరిలో గడ్డి, పొరక, రాళ్లు అడ్డము ఉండగ, వాటిని తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మృతుని కాళ్లకు పొరక చుట్టుకొని నీటిలో మోరి నుండి కొట్టుకొని పొగ తన వెంట ఉన్న వాళ్లు గమనించి బయటకు తీసి చికిత్స కోసం జమ్మికుంట కు తీసుక వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు, మృతిని కుమారుడు శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.వంశీకృష్ణ తెలిపారు.