కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ లో సురక్ష హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్.చొక్కారపు రాము దాదాపు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు పంపిణీ చేశారు. సురక్ష హాస్పిటల్ డాక్టర్ చోక్కారపు రాము మరియు హాస్పిటల్ సిబ్బందిని విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ భాను చైతన్య ఆధ్వర్యంలో మెమొంట్ ఇచ్చి శాలువాతో సత్కరించారు. వారు మాట్లాడుతూ గన్నేరువరం గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ చోక్కారపు రాము మాట్లాడుతూ అత్యధికంగా వృద్ధులు పాల్గొన్నారని వారికి సహకరించిన విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ యజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురక్ష హాస్పిటల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
