- ఎంపీడీవో శ్రీనివాస్ కి గ్రామస్తులు వినతి
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని యాస్వాడా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఉపాధి ద్వారా పనిచేసిన కూలీలు ఉపాధి కార్డు ద్వారా వ్యవసాయ కూలీలకు జీవన భృతి మంజూరులో రెగ్యులర్ గా పనిచేసిన వారిలో కొంతమంది పేర్లు మార్చి ఉపాధి కూలీలు పనిచేయకుండా వారికి జాబ్ కార్డు లో ఉన్న వారి పేర్లు జాబితా లో వచ్చిందని ఆ గ్రామంలో ఉపాధి హామీ మేటు సరిగా పనిచేయడం లేదని జాబితా సరిగా లేదని మేటును తొలగించాలని గురువారం గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ కి వినతి పత్రం ఇచ్చినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో మామిడిపెళ్లి లక్ష్మణ్, వి.సతీష్, బాలయ్య, అంజయ్య, అనిల్, చిగురు సంజువ్, చిగురు హరిక్,ఎం. అంజయ్య,జి.నర్సయ్య ఉన్నారు.