కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై తాండ్ర నరేష్, తాసిల్దార్ కార్యాలయంలో ఇప్ప నరేందర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్, గన్నేరువరం గ్రామపంచాయతీ కార్యాలయంలో వెంకట్ రెడ్డి, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఐకెపి భవనం ముందు ఏపీఎం లావణ్య, మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కె, రామయ్య మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న సదుపాయాలన్నీ ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల సిద్ధించబడ్డాయని తెలియజేశారు వారి ఆశయం మేరకు మనమందరం నడుచుకొని రాజ్యాంగాన్ని అమలు చేయడమే మనందరికీ ఘనమైన నివాళిఅని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సై దీపక్ కుమార్, ఏఎస్ఐ లు లక్ష్మీనారాయణ, రాధా కిషన్, డిప్యూటీ తాసిల్దార్ నరసింహాచారి, ప్రధానోపాధ్యాయురాలు సాయి శిరీష తదితరులు పాల్గొన్నారు.