కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో మధ్యాహ్నం భోజన వంట కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది . ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ తమ పనికి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి జీతాలు పెరిగినయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.కానీ ఇప్పుడు కనీసం పాత బకాయిలు కూడా రాలేదని మండిపడ్డారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బకాయిలను పెరిగిన జీతాన్ని వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.సిపిఐ నాయకులు మాట్లాడుతూ పెరిగిన జీతాన్ని వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో మధ్యాహ్నం భోజన కార్మికులు ఉన్నారని వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు . అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ రజినీకాంత్ కు వినతి పత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం ,కోశాధికారి గర్శకుర్తి శ్రీనివాస్,పిప్పల కానుకయ్య , మల్లయ్య,సాగర్ రెడ్డి,గంగిపల్లి కనకలక్ష్మి,కవిత,జాలిగం సత్తవ్వ,మిడి దొడ్డి విజయలక్ష్మి,కొంకటి దుర్గావ్వ, కల్లేపల్లి రాజవ్వ ,బండపల్లి బాలమ్మ,పాలెపు జనమ్మ , బత్తుల పుష్పలత,గొల్లపెల్లి సరిత,ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు .
