● మండల విద్యాధికారి కే. రామయ్య
కరీంనగర్ జిల్లా: రేపటినుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్ష నిర్వాహణ కొరకు గన్నేరువరం మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి కె. రామయ్య తెలిపారు. మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలల రెండు ప్రైవేటు పాఠశాలల 214 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అందులో 78 మంది బాలురు 136 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణ సజావుగా జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కల్పించమని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా చీఫ్ సూపర్డెంట్ గా మహేశ్వర్, డిపార్ట్మెంటల్ అధికారిగా శ్రీనివాస్,సెట్టింగ్ స్క్వాడ్ గా రఫ్ మరియు 13 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్ల గా నియామకం కాబడ్డారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు వేసవికాలం దృష్ట్యా చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచుతామని అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినట్లయితే త్వరగా వైద్య సౌకర్యం అందించే విధంగా పరీక్ష కేంద్రంలో వైద్య శాఖ తరపున ఏఎన్ఎం లను కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. పరీక్ష కేంద్రానికి విధి నిర్వహణ చేసే ఇన్విజిలేటర్ల విధులను సరైన విధంగా నిర్వర్తించాలని సూచించారు.ఇన్విజిలేటర్ల ఎవరు కూడా చెరవాణులను తీసుకురావద్దని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో స్నేహపూరిత వాతావరణంలో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా ఇన్విజిలేషన్ చేయాలని తెలిపినారు. అదే సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ విద్యార్థులు చేయకుండా చూడాలని అలాంటి విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇన్విజిలేటర్ లకు మార్గ నిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆ విధంగా పోలీస్ శాఖ వారు సహకరించాలని అదేవిధంగా గన్నేరువరం మండలంలోని ప్రజా ప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరినారు. పరీక్ష కేంద్రం దగ్గర లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని వారికి సూచించినట్లుగా మండల విద్యాధికారి తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి తప్పుడు విధానంలో పోకుండా పరీక్ష కేంద్రంలో నిబంధనల ప్రకారం గా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు ఈసారి 24 పేజీలతో కూడిన బుక్ లెటర్ ఇవ్వబడుతున్నారాయని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రం కు గంట ముందు రావాలని సూచించారు. వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలను మంచిగా రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలిపి జిల్లాకే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా మండల విద్యాధికారి కే.రామయ్య తెలిపినారు. ఈ సమావేశంలో చీఫ్ సూపర్డెంట్ మహేశ్వర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, సెట్టింగ్ స్క్వాడ్ రఫ్ తో పాటుగా ఇన్విజిలేటర్ల పాల్గొన్నారు.