కరీంనగర్ జిల్లా: మంద కృష్ణ పోరాట పలితంగానే ఎస్సి వర్గీకరణ ఆమోదం పొందినదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేపాక బాబు అన్నారు. ఆదివారం గన్నేరువరం మండలకేంద్రం వివేకనంద విగ్రహం నుండి అంబెడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తూ ర్యాలీగా బయలుదేరి మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 70 ఏళ్ల కళ నెరవేరిందన్నారు. కార్యక్రమంలో నాయకులు మండల ఉపాధ్యక్షులు కళ్ళేపెల్లి సురేష్ మాదిగ. జక్క పెళ్లి రాజకుమార్. ప్రధాన కార్యదర్శి రామంచ సతీష్. వేదిరా రాజకుమార్. నాగరాజు.మనోహర్.ఎంఎస్పి మండల అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్.టౌన్ ప్రెసిడెంట్ రామంచ సంపత్. చిలుముల లక్ష్మణ్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్. రామంచ ఇదయ్య. కవ్వంపెల్లి రాజయ్య. మునిందర్. విజేందేర్. తదితరులు పాల్గొన్నారు.
