కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్, తాసిల్దార్ ఇప్ప నరేందర్, ఎంఈఓ రామయ్య, ఏఎస్ఐ రాధా కిషన్, పీహెచ్ సీ డాక్టర్ ప్రణవ్, ఏఎల్ఓ చక్రధర్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, డిసిపియు సిబ్బంది శాంత, సదినేని రమేష్, సాయి కిరణ్, ఏపీఎం లావణ్య, బాలల హక్కుల పరిరక్షణ హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు, డ్రాఫ్ అవుట్ పిల్లలు, బాల కార్మికులు, దత్తత పిల్లల రక్షణ, సంరక్షణ మొదలగు అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్లు రేణుక, పుష్పలత, సరోజన తదితరులు పాల్గొన్నారు
