కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ స్వయంభు మానస దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీ మానస దేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, గంప వెంకన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ బోయిని అంజయ్య, కాంతల నరసింహ రెడ్డి, జాలి శ్రీనివాస్ రెడ్డి,కొండ శ్రీనివాస్, కొనగల అంజయ్య, పుస్తె మట్టెలు అందజేశారు. శ్రీ మార్కండేయ ఆలయంలో సీతారాముల కళ్యాణం కి పుస్తె మట్టెలు తేళ్ల కవిత లక్ష్మణ్ దంపతులు అందజేశారు. మైలారంలో హనుమాన్ దేవాలయంలో వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు, ఈకార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బోయిని అంజయ్య, కమిటీ సభ్యులు మునుగంటి లింగయ్య, జాలి శ్రీనివాస్ రెడ్డి, కాంతాల అంజిరెడ్డి, గొల్లపెల్లి రవి, బొడ్డు సునీల్, సమ్మెట అనిల్, శ్రీ మార్కండేయ ఆలయ చైర్మన్ తేళ్ల అంజయ్య,తేళ్ల సుధాకర్, తేళ్ల రవీందర్,బూర శ్రీనివాస్, ఉడ్నాల అంజయ్య, బలరాం, తేళ్ల సత్తయ్య,తేళ్ల చంద్ర శేఖర్,తేళ్ల భాస్కర్,తేళ్ల మహేష్,బూర లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.
