కరీంనగర్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణ రావు జన్మదిన వేడుకలను గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ వెంట నడిచిన పోరాట యోధుడు జి.వి. రామకృష్ణరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, పారువెల్ల గ్రామశాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, జాలి లింగారెడ్డి, గంప మహేశ్, సమ్మెట అనిల్, మధు, వెదిరె పరశురాం, పిట్టల రాములు, సాంబయ్యపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు అన్నాడి భగువాన్ రెడ్డి, నల్లగోని మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
