కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడారు. సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు, మండలంలో పెండింగ్ లో ఉన్న పనులు మరియు చేయాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలి అన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని నేను కూడా ప్రతి సమావేశానికి వస్తానని అన్నారు, ప్రస్తుతం గ్రామాలల్లో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వేసవి కాలంలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలని అధికారులకు సూచించారు. గుండ్లపల్లి నుండి పొత్తురు వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి మేము ఆనాడు పోరాటం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని 70కోట్లతో కేవలం ఒక జీవో తీసుకవచ్చి శంకుస్థాపన చేశారు. తప్ప రోడ్డు పనులు ప్రారంభించలేదని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ఆర్ధిక శాఖ నుండి పరిపాలన అనుమతులు తీసుకవచ్చి పనులు ప్రారంభించామనీ అన్నారు. అంతే కాకుండా మండలంలోని మైలారం డి8 కాలువ కానీ ఇతర సాగునీటి సమస్యలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్ళాను త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కారిస్తామని తెలిపారు,
గన్నేరువరం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి మండల అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తీగల శంకర్, ఎమ్మార్వో బిక్షపతి, ఎస్సై తాండ్ర నరేష్,ఎంపీఓ పీవీ నరసింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
