- కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్
- ముఖ్యఅతిథిగా హాజరైన గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్
కరీంనగర్ జిల్లా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాత్యహంకారం, ద్వేషం, కుల వివక్షత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశం లో కుల రహిత సమాజాన్ని కాంక్షించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్లోబల్ ఐకాన్ అని ఆయన జీవితం నేటి తరాలకే కాక బావి తరాలకు కూడా ఆదర్శనీయమని గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఐ తాండ్ర నరేష్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఏ మాత్రం ఆవేదన, ఆక్రందనలు లేకుండా జీవితంలో ఒకసారి అయినా ఆహారం, మంచినీరు, ప్రాథమిక విద్య, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గౌరవం, న్యాయం, శాంతి సంతోషాలతో జీవించాలని అంబేద్కర్ ఆకాంక్షించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్, నాయకులు న్యాత సుధాకర్, న్యాత జీవన్, నక్క అంజయ్య, మునేందర్, కవ్వంపల్లి రాయమల్లు, కవ్వంపల్లి రాజయ్య,రామంచ సపంత్, వేదేరే రాజయ్య, నర్సయ్య కొండ్రు,రాజ్ కుమార్,ఎర్ర రాజయ్య, అంజి,లింగయ్య,శంకర్,
ఎల్లయ్య,రాయనర్సు, సతీష్,రవి, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.