కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు పక్కన పొలంలో ఉన్న తాటి చెట్టును ఎలాంటి అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు గురువారం ఖాసీంపేట గ్రామానికి చెందిన బొజ్జ తిరుపతి జెసిబి సహాయంతో తొలగించారు. తాటి చెట్టును తొలగించిన రైతు తాటి చెట్టును కనపడకుండా వరిగడ్డితో తాటి చెట్టు పై కప్పి కాల్చే ప్రయత్నం చేశారు. అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు గమనించడంతో అక్కడినుండి వారు పరారయ్యారు. తాటి చెట్ల తొలగింపుతో గీత కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నామని తాటి చెట్టు తొలగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు గౌడ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ది రిపోర్టర్ టీవీ రిపోర్టర్ రాజ్ కోటి తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ సిఐ బాబాను వివరణ కోరగా ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.
