కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు.ఇందులో కరీంనగర్, హుజురాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎండీ జమీలొద్దీన్ పాల్గొన్నారు.
