కరీంనగర్ జిల్లా: చిరుమామిడి మండలం ఇందుర్తి మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షునిగా గట్టు శ్రీనివాస్ ఎన్నికైనారు. మంగళవారం సంఘ భవనంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షునిగా గట్టు శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా బోల్లి రాజయ్య, కార్యదర్శిగా కూన ముత్తయ్య లు గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కర్ణన్ కుమార్ తెలిపారు. గెలుపొందిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులతో పాటు డైరెక్టర్లను స్థానిక జడ్పిటిసి సభ్యులు, జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గీకురు రవీందర్ ముదిరాజ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమములో
గాగిరెడ్డిపల్లి,గునకులపల్లి, ఇందూర్తి మూడు గ్రామాలతో కలిసి మండలంలోని అతి పెద్ద సంఘోజీపేట చెరువుతో ఉన్న సంఘం. సంఘ అభివృద్ధికి కృషి చేస్తా అని అధ్యక్షలు తెలిపారు. డైరెక్టర్లు బరిగేల లక్ష్మణ్, గట్టు బాబు, కోన సంపత్ కుమార్, కన్నం కనకయ్య, కూన వెంకటేశం, కూన బాలయ్య లు డైరెక్టర్లుగా ఎన్నికైనారు,గట్టు వెంకటస్వామి,ప్రశాంత్, రంజిత్,బుల్లి శ్రీనివాస్, ఎర్రోళ్ల పోచయ్య బరిగెల కనకయ్య, శ్రీనివాస్ రాజయ్య, సమ్మయ్య రాజేశం,బొల్లి మల్లేశం, ఆంజనేయులు,రాజయ్య, అశోక్ తదితరులున్నారు.
