కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్ లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్దకు తరలివచ్చి, క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు సైతం ఉదయం వేళలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కరీంనగర్ నగర పాలక సంస్థ లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారు ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)