కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు.