ఈనాడు గ్రూప్స్ చైర్మెన్ శ్రీ. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. పత్రిక, మీడియా & వివిధ రంగాలలో రామోజీ రావు సేవలు తెలుగు జాతికి గర్వకారణం. క్రమశిక్షణ పట్టుదలతో ఏదైనా సాదించగలమని నిరూపించిన ఆదర్శ జీవితం వారిది. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బుర్ర రాజ్ కోటి గౌడ్ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి, ఈనాడు సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.