కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో ఆరే క్షత్రీయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు శ్రీశ్రీ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆరె సంఘం పెద్దలు శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ అతి కొద్ది మంది సైన్యంతో గెరిల్లా యుద్ధ రీతిలో పోరాటం చేసి అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. యువత శివాజీ ని స్పూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అధ్యక్షుడు మర్ధనపేట నరేష్,శ్రీకాంత్, సంతోష్,శ్రీనివాస్,రవీందర్, శ్రీను,మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ఆరె క్షత్రీయ కులబాందవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.