కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు టేకు రాధిక, పాశం రాజులను బుధవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు .ఒక్కో విద్యార్థికి 3 వేల చొప్పున పారితోషికం
అందజేసి వారిని అభినందించారు. పట్టుదలతో విద్యార్థులు ఉన్నంత చదువులు చదివి గన్నేరువరం మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామయ్య, అంజయ్య, నరేందర్ ,రామానుజన్ శ్రీలత, వసంత,శ్రీలత, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
