కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని పక్కా సమాచారంతో గన్నేరువరం ఎస్సై తాండ్ర నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం లారీ మరియు జెసిబి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంపు చేసి లారీ ద్వారా తరలిస్తున్నారు. గుండ్లపల్లి రాజీవ్ రహదారి పై లారీ జెసిబి ని సీజ్ చేసి లారీ డ్రైవర్ కోరేపు సంపత్ రెడ్డి, జెసిబి ఆపరేటర్ మెండ శ్రీకాంత్, వీరితో పాటు లారీ ఓనర్ కొండుగారి తిరుపతి రెడ్డి, జెసిబి ఓనర్ గూడెల్లి నరేష్, ఇసుక డంపు చేయించిన చింతల అనిల్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
