కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశములో మాట్లాడిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి చట్ట సభల మీద, పార్లమెంటరీ విధానం మీద అవగాహన లేక చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. జిల్లా పరిషత్ మీటింగ్ లో పరుష పద జాలముతో దూశించడమే గాక, నీ అంతు చూస్తానని, ఎన్నటికున్న చంపుతానని బెదిరించిన దానిపై టౌన్ ఏసీపీ నరేందర్ ను కలిసి ఫిర్యాదు చేస్తూ చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బలహీన వర్గాలు, బీసీ లంటే చులకన భావమన్నారు.బీసీ నాయకుల పట్ల పరుష పదజాలాంతో దుషించడం యావత్తు బీసీ సమాజాన్ని కించపరడ మన్నారు. నియోజకవర్గ ప్రజలను గెలిపించకుంటే కుటుంబ సభ్యులం సామూహికంగా మందు తాగి చస్తామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచావని ఏద్దేవా చేశారు. ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూల్ చేసి ఎంతో మందిని మోసం చేశావన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ బిఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నోనివి కాదా, ఉద్యమ కారులను రాళ్ళతో కొట్టిన ఉద్యమ ద్రోహివి అన్నారు. 48 గంటల్లో బేషరుతుగా క్షమాపణ చెప్పకుంటే తగిన కార్యాచరణతో గ్రామల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశములో డిసిసి యూత్ ప్రెసిడెంట్ పడాలా రాహుల్, ఎండీ శుకురోద్దీన్ కోప్షన్ మెంబర్, నాగుల కనుకయ్య గౌడ్ బిసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మాచర్ల అంజయ్య, మాడుగుల ప్రవీణ్, వేల్పుల అనూష, ఆకుల ఉదయ్, ఎండీ అజీమ్, గునుకుల రాజేశ్వర్ రెడ్డి, తోట సతీష్, చెల్పూరి విష్ణుమా చారీ తదితరులు పాల్గొన్నారు.