కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాం లో తమకు జీవనాధారమైన గొర్రెలు తమ కళ్ల ముందే చనిపోవడంతో గొర్రెలు కాపరుల కంటతడి…మైలారం గ్రామానికి చెందిన మర్రి తిరుపతి, పేరం ముత్తయ్య , మడికంటి అశోక్ కు చెందిన సుమారు 200 వందల గొర్రెలు లోయర్ మానేరు డ్యాంలో పరిసర ప్రాంతానికి మేపడానికి తీసుకొని వెళ్లారు..మధ్యాహ్నం 1గంటల సమయంలో భోజనం చేస్తుండగా కుక్కల గుంపు దాడి చేయడంతో లోయర్ మానేరు డ్యాంలోకి సుమారు 100గొర్రెలు లోయర్ మానేరు డాం నీళ్లలోకి వెళ్లాయి..స్థానికంగా ఉన్న ముదిరాజ్ సోదరులు స్థానిక యాదవ సోదరుల సహాయంతో సుమారు 70 గొర్రెలను ఒడ్డుకు చేర్చారు … 30గొర్రెలు నీట మునిగి చనిపోయాయి.మూడు లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు కంటతడి పెట్టారు. తమకు జీవనాధారమైన గొర్రెలు తమ కళ్ల ముందే చనిపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు..