- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ శివారులో గురువారం నెమలి మృతదేహం గ్రామస్తులకు లభ్యమైంది. గుట్ట దగ్గర కుందేలు, అడవి పందులను వేటగాళ్లు చంపి నెమలి, అడవి పంది, కుందేలు మాంసాన్ని దాబా లలో అమ్ముకుంటున్నారు. వన్యప్రాణులను రక్షించి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గురువారం సాయంత్రం సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ లు పరిశీలించారు.