రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ,సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనీ ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమన్ని ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి ప్రారంభిస్తున్నందుకు జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణాలు తగ్గి మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని దాన్ని నివారించలంటే తప్పకుండ మొక్కలు నాటాలన్నారు. కాలుష్యం నివారించడానికి మొక్కలు నాటడం చాలా అవసరం లేదంటే రాబోయే తరాల్లో బాగా ఇబ్బందులు ఎదురవుతాయి. అడవులు అంతరించిపోతున్న ఈరోజుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించవల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం లాగా ఆరంబడరంగా కాకుండా చిత్త శుద్ధితో మొక్కలు నాటుదాం అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో ప్రణాళిక బద్ధంగా చిత్తశుద్ధతో నాటుతం గత ప్రభుత్వం లాగా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటి పెరిగిన చెట్లను మళ్లీ నరికివేయడం కాకుండా ముందే ప్రణాళికతో చెట్లను నాటలని ప్రభుత్వము నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే మొక్కలు నాటకుండ ఉపయోగపడే పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటాలని ఈ కార్యక్రమంలో ప్రజల సహకారం తప్పకుండా ఉండాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఆడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్,మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.