కరీంనగర్ జిల్లా: రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ బాటపట్టిన నిరుపేద వ్యక్తి గత ఏడాదిగా ఏమయ్యాడో తెలియని దుస్థితి.. వివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ పరిధిలోని చొక్కాలపల్లికి చెందిన చొక్కల్ల శ్రీధర్ 2022 జూలైలో గల్ఫ్ కు వెళ్ళాడు. ఏడాది పాటు తన కష్ట జీతం ఇంటికి పంపాడు. కంపెనీ జీతం తక్కువ వస్తున్న క్రమంలో కంపెనీ వదిలి బయట పనిచేయడం ప్రారంభించిన క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇండియాకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు అప్పుచేసి 50 వేల రూపాయలు గల్ఫ్ కు పంపారు. అక్టోబర్-22-2023 రోజున శ్రీధర్ దుబాయిలో షార్జా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. ఇంతలో పోలీసులు పగా పెట్టి పట్టుకున్నారు. ఈ విషయం గల్ఫ్ లో ఉన్న తన స్నేహితులు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారు. ఈ విషయమై తన భార్య అఖిల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదని కన్నీరుమున్నీరు అవుతుంది. తనది నిరుపేద కుటుంబమని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తనను ప్రభుత్వం ఆదుకొని తన భర్తను తన వద్దకు చేర్చాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతుంది. పై విషయమై సోమవారం గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.