కరీంనగర్ జిల్లా: గన్నేరువరం ముదిరాజ్ సంఘం వారు మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ బిక్షపతి కి వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు బోయిని కుమార్ మాట్లాడుతూ కులం సర్టిఫికెట్ లో బీసీ-డీ సీరియల్ నంబర్ 19 గా దృవికరణ పత్రాలు జారి చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తమకు కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు బీసీ-ఏ ముదిరాజ్ కులం బీసీ-ఏ లోకి మార్చాలని ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షుడు రంగనవేణి లచ్చునర్సు,ఉపాధ్యక్షులు బోయని మల్లయ్య, ముఖ్య సలహాదారులు పెద్ద మల్లయ్య, బోయిని కుమార్, బోయిని మధు, దుర్ముట్ల రాజు, రంగనవేణి సతీష్,నర్సయ్య, ముదిరాజ్ కుల బంధువులు పాల్గొన్నారు.