కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి విడుదల లక్ష రూపాయల రుణమాఫీ విడుదల వేసిన సందర్భంగా రుణమాఫీ అర్హులైన రైతులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ గన్నేరువరం రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.. తదనంతరం గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. బాణసంచా కాల్చి , స్విట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, ముస్కు కరుణాకర్ రెడ్డి, బూర వెంకటేశ్వర్,బుర్ర తిరుపతి గౌడ్,దోగ్గలి ప్రదీప్, బుర్ర అంజయ్య గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.