కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.బాబా ఆదేశాల మేరకు గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు రామయ్య అధ్యక్షతన తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా, గంజాయి మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ బిక్షపతి, తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ ఎస్సైలు భారతి, శ్రీకాంత్, హాజరై మాట్లాడారు. యువత ఆలోచనలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు కాన్షిమోస్ఎస్ క్లబ్బు ఏర్పాటు దోహద పడుతుంది అని విద్యార్థులకు తగు సూచనలు, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయని ఉపాధ్యాయులు ఎక్సైజ్ శాఖ సిబ్బంది నరేష్, కొండల్, ధనలక్ష్మి, పాల్గొన్నారు.