కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో వృద్ధులు, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్ లో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్,గుడేల్లి ఆంజనేయులు, చింతల రవి, మీసాల ప్రభాకర్, బోయిని కుమార్, గొల్లపల్లి రవి, బూర శ్రీనివాస్,ర్యాగటి వీరయ్య, బండి తిరుపతి,సాయికుమార్, శంకర్,భగవాన్ రెడ్డి, రాములు, సమ్మెట అనీల్,ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు.