contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం మండల కేంద్రంలో హల్‌చల్ చేసిన ఎలుగుబంటి

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఎలుగుబంటి సంచరించడం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో మండల కేంద్రంలోని దొడ్లకడ దుర్గామాత మండపం సమీపంలోని రోడ్డుపై ఎలుగుబంటి తిరుగుతూ కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను గమనించిన కాలనీవాసులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులను అప్రమత్తం చేస్తూ, ఎలుగుబంటికి దూరంగా ఉండాలని సూచించారు.

గ్రామ శివారు ప్రాంతాల నుంచి ఆహారం కోసం ఎలుగుబంటి జనావాసాల్లోకి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ ఘటనతో గన్నేరువరం మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, రాత్రి వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడిన పరిస్థితి కనిపించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :